ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » వెనెజులాలో బస్సు, ట్రక్కు ఢీ: పదిమంది మృతి (passengers, killed, truck, Venezuelan capital, Bus | Victor Lira | director of the areas | Civil Protection agency)
వెనెజులా రాజధానిలో ప్రయాణీకులతో నిండిన బస్సును ఓ ట్రక్కు ఢీకొనడంతో పది మంది మృతి చెందగా మరో 12 మంది తీవ్ర గాయాలపాలైనారు.
ప్రయాణీకులతో నిండిన ఓ బస్సును ట్రక్కు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సంఘటనా స్థలంలోనే ఎనిమిది మంది మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని, మరో 12మంది తీవ్ర గాయాలపాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పౌర సంరక్షణాధికారి విక్టోర్ లీరా తెలిపారు.
తీవ్రంగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, ట్రక్కు అదుపు తప్పి బస్సును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని నగర అగ్నిమాపక శాఖాధికారి విలియమ్ మార్టినెజ్ తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు, అగ్నిమాపక బలగాలు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదిలావుండగా శనివారం జరిగిన ఈ ప్రమాదానికి ట్రక్కు బ్రేక్ ఫెయిల్ అవ్వడమే కారణంగా తాము భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
కాగా ఒక వారంలోపు రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించడంతో దాదాపు ఇరవై నాలుగుమంది మృతి చెందినట్లు అగ్నిమాపకాధికారి వివరించారు.