జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » భాజపా పాలిత రాష్ట్రాల్లో మత స్వేచ్ఛకు భంగం: యూఎస్ (BJP | UPA Rule | States | America | Hillory Clinton | Varun Gandhi | Obama)
Feedback Print Bookmark and Share
 
భారతదేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న మతవిధానం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేసింది. అదేసమయంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మతస్వేచ్ఛ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది.

అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా ఒక నివేదికను తయారు చేసింది. ఇందులో భారత్ అనుసరిస్తున్న విధానాలను ప్రశంసించింది. జాతీయ స్థాయిలో ఈ విధానం బాగా ఉన్నప్పటికీ.. రాష్ట్రాల స్థాయిలో కాస్త ఆందోళనకరంగా ఉందని ఆ నివేదికలో పేర్కొంది. మతపరంగా సున్నితమైన కొన్ని రాష్ట్రాల్లో భాజపా, ఎన్నికలకు ముందు మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టిందంటూ కొన్న స్వచ్ఛంద సంస్థలు చేసిన ఆరోపణలను సైతం ఈ నివేదికలో పేర్కొన్నారు.

ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో భాజపా యువనేత వరుణ్ గాంధీ విద్వేషపూరిత ప్రసంగాన్ని సైతం ఇందులో ప్రస్తావించారు. అమెరికాలో బరాక్ ఒబామా అధికారంలోకి వచ్చాక తయారు చేసిన ఈ నివేదికను ఆ దేశ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తాజాగా విడుదల చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.