జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » తాలిబన్లు ఆఫ్గన్ అధ్యక్ష ఎన్నికలను అడ్డుకోలేరు: అమెరికా (Afghanisthan | Terrorists | Taliban | President | Election | America)
Feedback Print Bookmark and Share
 
ఆఫ్గన్‌లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలకు ఉగ్రవాదులు ఆటంకం కలిగించేందుకు సిద్ధంగా ఉన్నారని, అయినా వారి ఆటలను తాము కొనసాగనివ్వమని అమెరికా తెలిపింది.

ఆఫ్గనిస్థాన్ దేశంలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు తాలిబన్ తీవ్రవాదువలతోసహా మరికొన్ని ఉగ్రవాద సంస్థలు కలిసి పని చేస్తాయని, వారిని తాము అడ్డుకుంటామని అమెరికాలోని వైట్‌హౌస్ ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ తెలిపారు.

తాలిబన్లు, మరికొన్ని అనుబంధ తీవ్రవాద సంస్థలు అధ్యక్ష ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారని, అయినా వారు ఎట్టి పరిస్థితుల్లో నెగ్గుకు రాలేరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో తమకు సుపరిపాలన అందించే ప్రభుత్వం రావాలి అక్కడి ప్రజలు భావిస్తున్నారని, రాబోయే రోజుల్లో అక్కడ సుపరిపాలన అందించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీంతో తాము అక్కడ సజావుగా ఎన్నికలను జరిపిస్తామని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం ఒబామా పరిపాలనలో అమెరికా ప్రభుత్వం సజావుగా పరిపాలన కొనసాగిస్తోందని, ముఖ్యంగా ఆఫ్గనిస్థాన్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఒబామా ఇప్పటికి ఆరుసార్లు చర్చలు జరిపారని ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుండగా ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ దేశాలలో జరుగుతున్న సంఘటనలపై జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అధ్యక్షుడు ఎడ్మిరల్ మైక్ ములేన్‌తో ఒబామా సంప్రదింపులు జరపనున్నారని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.