జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » భారతీయ ఐటీ నిపుణలకు బ్రిటన్ శుభవార్త! (Indians | IT Experts | Britan | President | Pratibha patil | PM | Brown)
Feedback Print Bookmark and Share
 
భారతీయ ఐటీ నిపుణులకు బ్రిటన్ ప్రధాని గోర్డాన్ బ్రౌన్ శుభవార్త చెప్పారు. బ్రిటన్ సమాచార సాంకేతిక రంగం అభివృద్ధికి భారతీయ ఐటీ ఉద్యోగుల భాగస్వామ్యాన్ని అనుమతిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు హామీ ఇచ్చారు.

డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఉన్న బ్రిటీష్‌ ప్రధాని అధికారిక భవనంలో బ్రౌన్‌ను ప్రతిభా పాటిలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రిటన్‌ ఐటీరంగం అభివృద్ధిలో భారతీయ ఐటి ఉద్యోగుల సలహాలు పాటించి వారిని భాగస్వాములను చేయాలని ప్రతిపాదించారు.

ఈ ప్రతిపాదననను అధ్యక్షుడితో పాటు విదేశీ మంత్రిత్వ శాఖ అధికారుల పరిశీలనకు తప్పనిసరిగా పంపిస్తామని ప్రధాని హామీఇచ్చారు. అమెరికాతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు కూడా ఐటీ రంగంలో భారతీయుల భాగస్వామ్యాన్ని అనుమతి స్తున్నాయని రాష్ట్రపతి గుర్తు చేశారు.

అనంతరం గోర్డాన్ బ్రౌన్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా మెరుగుపడాలంటే.. భారతీయ ఐటీ ఉద్యోగుల భాగస్వామ్యం అవసరమేనని అంగీకరించారు. అనంతరం ఆర్థిక, విద్యా రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు అర్థగంటపాటు చర్చించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.