జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » విభేదాల పరిష్కారానికి చొరవ చూపాలి: హిల్లరీ క్లింటన్ (India | Pakistan | America | Hillary Clinton | Zardari | Gilani | Sharif)
Feedback Print Bookmark and Share
 
ఇరు దేశాల మధ్య దీర్ఘకాలింకా నలుగుతున్న విభేదాల పరిష్కారానికి భారత్, పాకిస్థాన్‌ను చొరవ చూపాలని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సూచించారు. ఈ రెండు దేశాల మధ్య సఖ్యత నెలకొన్నపుడే వాణిజ్యం మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ఆమె పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా గురువారం లాహోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటే ఎలాంటి సమస్యలనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

భారత్-పాక్‌లు తమ సమస్యలన ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని సూచించిన ఆమె... ఇందుకోసం అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అమెరికా ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పాక్‌లో సముద్రతీరం ఉండటం అదనపు బలం కాగా, భౌగోళికంగా వ్యూహాత్మకంగా ఉందని, అందువల్ల భవిష్యత్‌లో ఆర్థికంగా గొప్ప శక్తిగా ఎదుగుతుందన్నారు.

అయితే, భారత్‌తో ఉన్న విభేదాలను పరిష్కరించుకున్న రోజునే ఇది సాధ్యమని హిల్లరీ తేల్చి చెప్పారు. తమకు భారత్-పాక్‌లు రెండూ మిత్రదేశాలేనన్నారు. గత కొన్నేళ్లుగా పాక్‌కు మౌళిక సదుపాయాల రూపకల్పనకు అమెరికా సాయం చేస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.