ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » తన దేశ పౌరులను హెచ్చరించిన అమెరికా (America | FBI | Pakisthan | Lashkar-e-Toiba | Terrorists | Public | India | Blasts | Holy Places)
ఓ అమెరికా పౌరుని ద్వారా భారతదేశంలో విధ్వంసం సృష్టించేందుకు పాక్‌లోనున్న లష్కర్-ఏ-తొయిబా ప్రయత్నిస్తోందని ఎఫ్‌బీఐ వెల్లడించిన నేపథ్యంలో అమెరికా పౌరులు భారత సందర్శన నిమిత్తం జాగరూకతతో వ్యవహరించాలని తమ దేశ పౌరులను హెచ్చరించింది.
భారతదేశంలో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారని తమ ప్రభుత్వానికి తరచూ నివేదికలు అందుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని అమెరికా ప్రభుత్వం తమ దేశ పౌరులను భారతపర్యటన సందర్భంగా జాగరూకతతో వ్యవహరించండని, ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక రోజులలో భారతదేశంలో మీ పర్యటనను కుదించుకోండని అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖకు చెందిన బ్యూరో ఆఫ్ కౌన్సిలర్ అఫేయర్స్ హెచ్చరికలు జారీ చేసింది.
తాజాగా భారతదేశంలో వచ్చే ఏడాది జనవరి 28 లోపు తీవ్రవాదులు విధ్వంసాలకు పాల్పడేందుకు కుట్ర పన్నారని బ్యూరో ఆఫ్ కౌన్సిలర్ అఫేయర్స్ తెలిపింది. ప్రధానంగా అమెరికా దేశస్తులు, పశ్చిమ దేశాల ప్రజలు పర్యటించే ప్రాంతాల్లోనే ఈ విధ్వంసాలు జరిగే ప్రమాదం ఉందని ఆ సంస్థ వివరించింది.
ప్రధానంగా భారతదేశంలోని ప్రధాన నగరాలు, జనసమ్మర్థమైన ప్రాంతాలు, ప్రత్యేక హోటళ్ళపై తీవ్రవాదులు నిఘా దాడులకు పాల్పడేందకు పూనుకోనున్నారని తెలిపింది.
ప్రధానంగా జనసమర్థమైన ప్రాంతాలు, ధార్మిక స్థలాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు తదితర ప్రదేశాల గురించి సురక్షితమైనవా కాదా తెలుసుకుని మరీ ప్రయాణించమని అమెరికా తన దేశ పౌరులకు సూచించింది.