జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » భారత్‌తో చర్చించేందుకు మేమూ సిద్ధమే: పాక్ (India | Pakisthan | PM | Manmohan Singh | Borders | Ministry Of Comunications)
Feedback Print Bookmark and Share
 
ఇటీవల భారత ప్రధాని మన్మోహన్ సింగ్ పాకిస్థాన్‌‍తో చర్చించేందుకు తాము సిద్ధమేనని పిలుపునివ్వడంతో పాకిస్థాన్ కూడా తాము కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

ఇరు దేశాల సరిహద్దులు, తదితర సమస్యలపై చర్చించేందుకు భారత ప్రధాని సుముఖంగా ఉన్నట్లు ప్రకటించడంతో తాము స్వాగతిస్తున్నామని, భారతదేశంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రసార శాఖామంత్రి కమర్ జమాన్ కైరా శుక్రవారం వెల్లడించారు.

ఇరు దేశాలలో నెలకొన్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తాము భారత్‌కు పిలుపునిస్తున్నామని, ఇప్పటికే భారతదేశం స్పందించిందని ఆయన తెలిపారు.

ఇదిలావుండగా భారత ప్రధాని ఇటీవల చేసిన ప్రకటనతో చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తాము తొలినుంచి చెపుతున్నామని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు.

కాగా భారతప్రధాని జమ్మూ-కాశ్మీర్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్ళే సమయంలో శ్రీనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... జమ్మూ-కాశ్మీర్‌ సమస్యతోపాటు తమ ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పాకిస్థాన్‌తో చర్చించేందుకు సిద్ధమేనని ప్రకటించారు. అలాగే ముంబైలో జరిగిన దాడుల నేపథ్యంలో పాక్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.