జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ముషారఫ్ సంపదను జప్తు చేయండి: కోర్టు (Pakisthan | Former President | Musharraf | North-west | Abbottabad)
Feedback Print Bookmark and Share
 
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంపదను జప్తు చేయండని పాక్ వాయువ్యప్రాంతంలోనున్న అబోతాబాద్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ముషారఫ్ పరిపాలన కాలంలో ఓ వ్యక్తి కనిపించడం లేదని, అతనిని అపహరించింది ముషారఫ్ అని అదృశ్యమైన వ్యక్తి కుటుంబం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అతని సంపదను జప్తు చేయాలని అబోతాబాద్ జిల్లా కోర్టు పోలీసులుకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా కోర్టు విచారించిన మీదట ముషారఫ్‌ను పారిపోయిన అపరాధిగా గుర్తిస్తు, అతని సంపదను జప్తు చేయాల్సిందిగా జిల్లా కోర్టు శుక్రవారం ప్రకటించిందని పిటిషనర్ తరపు న్యాయవాది ముహమ్మద్ ఇక్‌బాల్ తెలిపారు.

పాక్ చట్టం ఆరు ప్రకారం మార్చ్ నెలలో పిటిషనర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని, దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టి అక్టోబర్ నెల 30న అంటే శుక్రవారం తుది తీర్పును వెలువరించిందని ఆయన వివరించారు.

దీనిపై ముషారఫ్ స్పందించకపోతే పోలీసులు న్యాయవాది తీర్పును అమలు చేస్తారన్నారు. గత ఆరు-ఏడు నెలలుగా పోలీసులు ముషారఫ్ కొరకు వెతుకుతున్నారని, కాని అతని తరపువారెవ్వరూ కంప్లెయింట్ స్వీకరించి కోర్టుకు హాజరు కాలేదని ఆయన తెలిపారు.

ఏప్రిల్ నెల నుంచి ముషారఫ్ పాకిస్థాన్ దేశం బయటే ఉన్నారని, ఇటీవలే అతని ఉపన్యాసాలు అమెరికాలో పూర్తయ్యాయని, గత కొద్ది వారాలుగా ఆయన లండన్‌లో ఉంటున్నారని ఆయన అన్నారు.

ఇదిలావుండగా ముషారఫ్‌పై న్యాయవిచారణ జరిపించడం సాధ్యం కాదని పాక్ ప్రధాని యూసుఫ్ రజా గిలాని వ్యాఖ్యానించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.