జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » బిబిసి ప్రసారాలను నిలిపేసిన పాక్ ఎఫ్ఎమ్ (Pakistan | BBC broadcasts | FM channels | Islamabad | PEMRA)
Feedback Print Bookmark and Share
 
పాకిస్థాన్‌లోని ప్రైవేట్ ఎఫ్ఎమ్ రేడియోలలో బిబిసి వార్తలను ప్రసారం చేయకుండా ఆ దేశం నిలిపేసింది. పాక్ నిలిపేసిన తమ ప్రసారాలు మొత్తం 50శాతం ప్రభావం చూపిస్తాయని బిబిసి సంస్థ పేర్కొంది.

బిబిసి సంస్థ ప్రతి రోజు ఐదు నిమిషాలపాటు ఎఫ్ఎమ్ స్టేషన్లకు గత సంవత్సరం నుంచి వార్తలను ప్రసారం చేస్తోంది. దీనిని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరి అథారిటీ (పిఈఎమ్ఆర్ఏ) గత కొద్ది రోజులుగా తమ ప్రసారాలను నిలిపేసిందని బిబిసి వెల్లడించింది.

గతంలో పిఈఎమ్ఆర్ఏ ఎఫ్ఎమ్ స్టేషన్ల ద్వారా తమ వార్తలను ప్రసారం చేయాలని కోరిందని బిబిసి సంస్థ తెలిపింది. దీంతో తాము గత సంవత్సరం నుంచి ఆ దేశానికి తమ వార్తా ప్రసారాలను అందించేవారమని బిబిసి పేర్కొంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.