హెచ్ఐవీ వ్యాధితో బాధపడుతున్న వారికి తమ దేశంలో ప్రవేశం కల్పిస్తూ అమెరికా ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో హెచ్ఐవీ బాధితలకు అమెరికా దేశంలో ప్రవేశాన్ని నిషేధించారు. దీంతో వ్యాధిబారినపడినవారు ఆ దేశానికి ప్రయాణించేందుకు అవకాశం లేకుండా పోయింది. తాజాగా శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ సంబంధిత బిల్లుపై సంతకం చేశారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇదివరకటి అధ్యక్షుడు తన పదవీ కాలంలో హెచ్ఐవీ బాధితలకు అమెరికా ప్రవేశంపై నిషేధం విధించారని, ఆయన విధించిన నిషేధం సోమవారంతో ముగుస్తుందని, దీనిని తాము తొలగించి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రపంచంలో హెచ్ఐవీ వ్యాధితో బాధపడుతున్న బాధిత దేశాలు దాదాపు 12కు పైగానే ఉన్నాయని, వాటిలో తమ దేశం కూడా ఒకటని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.