జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » అమెరికా విధానాలను సమర్థించిన సూకీ (Aung San Suu Kyi | Mayanmar | American policy | supports)
Feedback Print Bookmark and Share
 
మయన్మార్‌లో నిర్బంధిత ప్రతిపక్ష నేత ఆంగ్ సాన్ సూకీ.. అమెరికా విధానాలకు మద్దతు పలికారు. అమెరికాకు చెందిన ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులు త్వరలో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో సూకీ ఈ వ్యాఖ్యలు చేశారు. మయన్మార్ మిలిటరీ పరిపాలకులతో అమెరికా ఒప్పందాలను సైతం ఆమె సమర్థించారని సూకీ తరపు న్యాయవాదులు తెలిపారు.

బర్మా విదేశాంగ శాఖ సహాయ కార్యదర్శి కర్ట్ కాంప్‌బెల్ మయన్మార్‌కు రానున్నారు. రెండు రోజుల కాంప్‌బెల్ పర్యటనలో.. షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం మరియు సూకీతో సహా ప్రతిపక్ష నేతలను కూడా కలుసుకుంటారు. గతంలో మయన్మార్‌కు వ్యతిరేకంగా.. మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ప్రభుత్వం పనిచేసింది.

అయితే.. అమెరికా చేసిన తాజా విధానాలు మయన్మార్‌‌కు అనుకూలం ఉన్న నేపథ్యంలో.. కాంప్‌బెల్ ఈ పర్యటనలో భాగంగా అమెరికా విధానాలపై కాంప్‌బెల్ చర్చించనున్నారు. సీనియర్ మయన్మార్ అధికారులతో న్యూయార్క్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో కాంప్‌బెల్ చర్చలను కొనసాగిస్తున్నారు. సుమారు దశాబ్దం తర్వాత ఇలాంటి అత్యున్నత స్థాయి ఇరు దేశాల మధ్య జరగడం విశేషం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.