జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » కసబ్ పరారీలో ఉన్నాడు: పాక్ కోర్టు ప్రకటన (26/11 | Pakistan court | Judge | Malik Muhammad Akram | Kasab | Aabsconders)
Feedback Print Bookmark and Share
 
గత ఏడాది భారతదేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరంపై జరిపిన ఉగ్రవాద దాడులతో సంబంధం ఉన్నదంటూ చార్జిషీటులో పేర్కొన్న నిందితులపై శనివారం పాకిస్తాన్ ట్రయిల్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణకు హాజరుకాని అజ్మల్ కసబ్‌తో సహా మరో 13 మంది పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటిస్తూ తదుపరి విచారణను నవంబరు 7కు వాయిదా వేసింది.

ప్రధాన న్యాయమూర్తి అక్రమ్ అవాన్ శనివారం ముంబయి దాడులకు సంబంధించి విచారణను చేపట్టిన అనంతరం దోషులుగా పరిగణించబడుతున్న 14 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ 14 మంది నిందితులలో భారతదేశం పట్టుకున్న అజ్మల్ కసబ్ పేరు కూడా వున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.

నిందితులగా పేర్కొనబడిన 13 మందికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోవడంతో జడ్జి తదుపరి విచారణను నవంబరు 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు నిందితులకు వ్యతిరేకంగా వాదించేందుకు న్యాయవాదులు జంకుతున్నారు. దీంతో ఈ కేసు నత్తనడకన సాగుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.