జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్, హిల్లరీ భేటీ (Hillary Clinton | Mohmad Abbas | Palastene | Israel | Obama)
Feedback Print Bookmark and Share
 
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్, పాలస్తీనా అధ్యక్షుడు మొహ్మద్ అబ్బాస్‌లు శనివారం కీలక చర్చల్లో పాల్గొన్నారు. శాంతి చర్చలను పున: ప్రారంభించేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలని ఈ సమావేశంలో భాగంగా చర్చించినట్లు తెలిసింది.

పాకిస్థాన్‌లో పర్యటన ముగించుకున్న అనంతరం హిల్లరీ అబుదాబిలో అబ్బాస్‌ను కలుసుకున్నారు. పశ్చిమాసియాతో కొత్త శాంతి ఒప్పందం కుదుర్చుకునేలా ఒత్తిడి తీసుకువచ్చేందుకు పాలస్తీనా, ఇజ్రయెల్ అధికారులతో అనేక సమావేశాల్లో ఆమె పాల్గొననున్నారు.

ఆ తర్వాత ఆమె ఇజ్రాయెల్‌లో ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ, విదేశాంగ మంత్రి అవిగ్దోర్ లీబర్‌మాన్ తదితరులతో కీలక సమావేశాలు జరుపనున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉన్నందువల్ల అమె శాంతి చర్యలకు ప్రాంతీయ మద్దతును కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు.

ఇందుకోసం.. వచ్చే వారంలో మొరాకోలో జరుగనున్న అభివృద్ధి సదస్సులో అరబ్ విదేశాంగ మంత్రులను కలవడానికి కన్నా ముందే.. ఆ రెండు దేశాలు ఏ స్థితిలో ఉన్నది హిల్లరీ ఈ సమావేశాలు జరుపనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇజ్రాయెల్, పాలస్తీనియన్లల మధ్య వివాదాలకు పరిష్కారాలను చేస్తే శాంతి క్రమంలో పురోగతి సాధించవచ్చని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా భావిస్తున్నట్లు హిల్లరీ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.