ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » భారత్, పాక్ ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలి: ఖురేషీ (Shah Mehmood Qureshi | India | Pakistan | terrorists | Foreign Minister | Shah Mehmood Qureshi)
భారత్, పాక్ దేశాల్లో శాంతి వర్ధిల్లాలంటే ఇరు దేశాలు సంయుక్తంగా ఉగ్రవాదంపై పోరాడాలని పాక్ సోమవారం కోరింది.
ఉగ్రవాదంపై పోరాడేందుకు భారత్, పాక్ సంయుక్తంగా కలిసి పోరాడాలని పాకిస్థాన్ విదేశాంగ శాఖామంత్రి షా మెహమూద్ ఖురేషీ అన్నారు.
ఉగ్రవాదంపై తలపడేందుకు తమ ఇరు దేశాలు సంయుక్తంగా పోరాడాలని, దీనిపై భారతదేశం సానుకూల దృక్పథంతో ఆలోచించాలని ఆయన భారత్‌ను కోరారు.
నిరుడు ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడులతో భారతదేశంలో ప్రశాంతత లోపించిందని, దీనికి ఆ దేశం తమ దేశాన్ని తప్పుపడుతోందని, తామే ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్నామని వారు ఆరోపిస్తున్నారని ఆయన తెలిపారు.
పాక్ భూభాగంపై ఏ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలను అనుమతించే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఉభయ దేశాల మధ్యనున్న సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాలు కలిసి చర్చలు చేస్తేనే సమస్యలు పరిష్కారమౌతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి చెందుతున్న ఇస్లామిక్ ఎనిమిది దేశాల సదస్సు రేపు కౌలాలంపుర్‌లో జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆయన కౌలాలంపుర్ చేరుకున్నారు.