జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » అబ్దుస్‌ను పోలీసు కస్టడీకి తరలించిన బంగ్లా కోర్టు (Bangla | Huji | custody |court | Sheikh Abdus Salam | Harkatul Jihad al Islami | Prime Minister | Sheikh Hasina)
Feedback Print Bookmark and Share
 
గడచిన 2004లో బంగ్లా ప్రధాని షేక్ హసీనాపై దాడులకు పాల్పడ్డ షేక్ అబ్దుస్ సలామ్‌ను బంగ్లా కోర్టు పది రోజులపాటు పోలీసు కస్టడీకి తరలించింది.

బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించిన సంస్థ హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ(హుజి) వ్యవస్థాపకుడు షేక్ అబ్దుస్ సలామ్ గతంలో ప్రధాని షేక్ హసీనాపై దాడులకు పాల్పడి పోలీసులకు చిక్కాడు.

అతనిని విచారణ నిమిత్తం కోర్టుకు తరలించగా పది రోజుల వరకు పోలీసుల కస్టడీలో ఉంచాలని రెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హబీబుర్ రెహ్మాన్ సిద్దీఖ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

సలామ్‌ను సోమవారం నాడు తాము అదుపులోకి తీసుకున్నామని, కోర్టు ఎదుట హాజరు పరచగా కోర్టు అతనికి పది రోజులపాటు రిమాండ్‌కు తరలించిందని, దీంతో అతనిని తాము విచారిస్తున్నట్లు సిఐడి అధికారులు తెలిపారు.

ఇతను 2004లో ఆవామీ లీగ్ పార్టీ ర్యాలీనుద్దేశించి ఆ పార్టీ అధ్యక్షురాలు హసీనా ప్రసంగిస్తుండగా గ్రెనేడ్లతో దాడులకు పాల్పడ్డాడని, ఈ దాడుల్లో 24 మంది మృతి చెందగా మరో 400 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనారని, ఈ దాడుల్లో హసీనా ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నారని సిఐడి అధికారులు వివరించారు.

ఇదిలావుండగా నిషేధిత సంస్థ అయిన హుజికి చెందిన కొందరు తీవ్రవాదులు నిరుడు భారతదేశంలోను దాడులకు పాల్పడ్డారని, ఇది ఇస్లామిక్ డెమొక్రటిక్ పార్టీ ఆదేశాల మేరకు జరిగివుండొచ్చని తాము అనుమానిస్తున్నట్లు సిఐడి వర్గాలు వెల్లడించాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.