జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » కంగ్రాచ్యులేషన్స్ కర్జాయ్ ! : ఒబామా (Afghanisthan | President | Election | Hamid karzai | Congratulations)
Feedback Print Bookmark and Share
 
ఆఫ్గనిస్థాన్ అధ్యక్ష ఎన్నికలలో గెలుపొందిన హమీద్ కర్జాయ్ అమెరికా అధ్యక్షుడు శుభాకాంక్షలు చెప్పారు.

అధ్యక్ష ఎన్నికలలో గెలుపొందిన హమీద్ కర్జాయ్‌కు అమెరికా అధ్యక్షుడు ఒబామా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రెండవసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక దేశంలో కొత్త అధ్యాయానికి నాంది పలికారని, అవినీతితో పోరాడాలని ఒబామా సూచించారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ బాధ్యతలు మరింత పెరిగాయని, ప్రభుత్వాన్ని పటిష్టం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు.

ఇదిలావుండగా సోమవారం నాడు ఎన్నికల సంఘం కర్జాయ్ అధ్యక్షునిగా గెలపొందినట్లు ప్రకటించింది. దీంతో అక్కడి పరిస్థితి చాలా భయంకరంగా ఉండిందని, కాని ఎట్టకేలకు అక్కడ నెలకొన్న పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.