జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » హిందువుల సంపదను తిరిగి ఇస్తాం: బంగ్లాదేశ్ (Indo-pak | Bangladesh | Amendment | PM | Shaik Haseena | Wasted Property Return Act)
Feedback Print Bookmark and Share
 
1965లో భారత్-పాక్ దేశాల మధ్య జరిగిన యుద్ధం సందర్భంగా బంగ్లాదేశ్‌లోని హిందువులనుంచి బలవంతంగా లాక్కున్న సంపదను తిరిగి వారికే అప్పగించేందుకు ఓ చట్టాన్ని ఆ దేశం రూపొందించింది.

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా అధ్యక్షతన వేస్టెడ్ ప్రాపర్టీ రిటర్న్(అమెండ్‌మెంట్) యాక్ట్ 2009ని ఆ ప్రభుత్వం కొనసాగించేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని చట్ట సభలో ఆమోదింపజేసి హిందువుల ఆస్తులను, వస్తువులను తిరిగి వారికి అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని ప్రధానమంత్రి ప్రతినిధి మహబూబుల్ హక్ షకీల్ మంగళవారం తెలిపారు.

గతంలో బంగ్లాదేశ్ ప్రాంతం పాకిస్థాన్ దేశం ఆధీనంలో ఉండింది. అప్పట్లో హిందూ కుటుంబాలకు చెందిన ఆస్తి, ధన, వస్తువులను జప్తు చేయాలని, 1965లో జరిగిన యుద్ధ కాలంలో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది.

ప్రస్తుతం ఆ దేశ ప్రధాని హసీనా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హిందూ కుటుంబాలకు చెందిన ఆస్తులను, వస్తువులను తిరిగి వారికి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.