జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఐరాసలో కాశ్మీర్ ప్రస్తావన లేవనెత్తిన పాక్ (UN | Humanity | Pakisthan | India | Jammu-Kashmir | Development)
Feedback Print Bookmark and Share
 
ఐక్యరాజ్య సమితిలో మానవీయ అంశాలపై జరుగుతున్న ప్రత్యేక సమావేశంలో పాకిస్థాన్ దేశం జమ్మూ-కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది.

ప్రస్తుతం జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలు వారి నిర్ణయాలను వెల్లడించే అధికారులు లేవని, దీనిని భారత్ తొక్కిపెడుతోందని పాక్ ప్రతినిధి అమ్జాద్ హుస్సేన్ ఐరాసకు తెలిపారు.

దీంతో భారతదేశానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ బి.కె. హరిప్రసాద్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కాశ్మీర్ తమ దేశంలోని భాగమేనని, అక్కడి ప్రజలు క్రమం తప్పకుండా స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొంటున్నారని, ప్రస్తుతం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాలను చూస్తొందని, దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసిందని ఆయన ఐరాసకు వివరించారు.

కాశ్మీర్ విషయంపై మాట్లాడే అర్హత పాక్‌కు లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అక్కడి పరిస్థితి ప్రస్తుతం ప్రశాంతంగానే ఉందని ఆయన వివరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.