జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » జర్దారీకి వ్యతిరేకంగా పాక్ ఆర్మీ జనరల్స్ కుట్ర! (Zardari | Pakistan | Army Chief | Strarfor | Emergency | Gilani | Supreme Court)
Feedback Print Bookmark and Share
 
సంక్షోభాలకు, ఎమర్జెన్సీలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన పాకిస్థాన్‌లో మరోమారు అత్యయిక పరిస్థితి ఎదురుకానుందా? అవుననే సమాధానం చెపుతోంది.. అమెరికాకు చెందిన అంతర్జాతీయ ఇంటలిజెన్స్ స్వచ్ఛంద సంస్థ "స్ట్రాట్‌ఫర్". ఈ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ అష్పాక్ ఖయానీ వచ్చే ఏడాది అక్టోబరులో పదవీ విరమణ చేయనున్నారు.

ఆయన స్థానంలో తనకు అడుగులుమడుగులు వత్తే వ్యక్తికి ఆర్మీ చీఫ్ బాధ్యతలను అప్పగించేందుకు జర్దారీ ఇప్పటి నుంచే యోచన చేస్తున్నారు. ఇది సుతరామా ఇష్టంలేని ఆర్మీ జనరల్స్ ఆయనకు వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించారు. ఇందులోభాంగా, ఖయానీ పదవీ విరమణ కాలం ముగియక ముందే సైనిక తిరుగుబాట చేసి జర్దారీని పదవి నుంచి తప్పించాలన్నది వారి పన్నాగంగా ఉందని నిఘా సంస్థ హెచ్చరించింది.

అయితే, బలవంతంగా జర్దారీని దించడం కంటే.. రాజ్యాంగ ప్రక్రియ ద్వారానే ఆయన్ను గద్దె దిగిపోయేలా చేయాలన్నదే జనరల్స్ సరికొత్త ఆలోచనగా ఉందని చెప్పుకొస్తోంది. దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందున ఆయనతో కలిసి పని చేయాల్సిన నిర్భంద పరిస్థితి ఆర్మీకి, ఐఎస్ఐకు ఏర్పడినట్టు పేర్కొంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.