జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » జాతీయ సైనిక కళాశాలపై లష్కరే కుట్ర: ఎఫ్‌బీఐ (Capital | India | Pakisthan | David Coleman Headley | Tahawwur Hussain Rana | National Defence College | Chicago | court)
Feedback Print Bookmark and Share
 
దేశ రాజధాని ఢిల్లీలోనున్న జాతీయ సైనిక కళాశాలపై దాడులు చేసేందుకు లష్కర్-ఏ-తొయిబా కుట్ర పన్నినట్లు ఎఫ్‌బీఐ తెలిపింది.

ఢిల్లీలోని జాతీయ సైనిక కళాశాలపై దాడులు చేసేందుకు లష్కర్ తీవ్రవాదులు కుట్ర పన్నారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెష్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తెలిపింది.

గత నెలలో ఎఫ్‌బీఐ అధుపులోకి తీసుకున్న డేవిడ్ కలోమన్ హెడ్లీ, తహువర హుస్సేన్ రాణాలను విచారించిన అనంతరం ఈ విషయాలు వెల్లడైనట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది.

చికాగో కోర్టులో నిన్న రాణా బెయిల్ మంజూరు కొరకు అర్జీ పెట్టుకున్నాడు. ఈ విషయంగా అమెరికాకు చెందిన న్యాయవాది మాట్లాడుతూ... రాణా అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని, అతనికి బెయిల్ మంజూరు చేస్తే ప్రపంచంలో చాలా దారుణాలు జరుగుతాయని, ముఖ్యంగా భారత దేశం రాజధానిలోనున్న సైనిక కళాశాలపై దాడులు చేసేందుకు కుట్రలు పన్నారని ఆయన కోర్టుకు విన్నవించారు.

రాణా పాకిస్థాన్ దేశంలో పుట్టి కెనడాలో పెరిగి ప్రస్తుతం చికాగోలో నివసిస్తున్నాడని, ఇతనిని గత నెలలో ఎఫ్‌బీఐ తమ అదుపులోకి తీసుకుందని, ఇతనితోపాటు ఇతని స్కూలు స్నేహితుడు అమెరికా పౌరడు హెడ్లిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు వెల్లడైన్నట్లు ఆయన కోర్టుకు వివరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.