జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఇరాన్‌లో భూకంపం: 269 మందికి గాయాలు (Iran | Earth Quake | Wednes Day | Southern port city of Bandar Abbas | injures 269 | People | Telephone lines)
Feedback Print Bookmark and Share
 
ఇరాన్‌లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం భూకంపం సంభవించడంతో పలువురు తీవ్ర గాయాలపాలైనారు.

ఇరాన్‌లోని దక్షిణ ఇరానియన్ పోర్ట్ సిటీ బందర్ అబ్బాస్‌లో బుధవారం ఉదయాత్పూర్వం స్థానిక సమయం గం.2.56లకు భూకంపం సంభవించడంతో దాదాపు 269 మందికి పైగా ప్రజలు తీవ్రగాయాలపాలైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని భూగర్భ పరిశోధనా సంస్థకు చెందిన అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

భూకంపం సంభవించడంతో స్థానిక టెలిఫోన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినింది. ఇప్పటి వరకు ఎవ్వరికీ ప్రాణహాని కలగలేదని, ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

బుధవారం ఉదయాత్పూర్వం సంభవించిన భూకంపం ఇరాన్ రాజధానికి దక్షిణాన 1,367 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు ప్రారంభమైనాయని అధికారులు పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.