జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఇరాన్‌తో స్నేహం చేయాలనుకుంటున్న అమెరికా (Iran | America | President | Obama | Tehran | American Ambassador | Office)
Feedback Print Bookmark and Share
 
ఇరాన్ దేశంతో స్నేహం చేయాలనుకుంటున్నట్లు అమెరికా తెలిపింది.

ఇన్ని రోజులు తాము అనుమానం, అవిశ్వాసం, పలు రకాల ఇబ్బందుల కారణంగా ఇరాన్ దేశంతో స్నేహం చేయలేకపోయామని, ఇకపై తాము స్నేహ హస్తం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా బుధవారం అన్నారు.

తెహ్రాన్‌లో అమెరికా దౌత్యకార్యాలయంపై ఆక్రమణ జరిగి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇకపై తమ ఇరుదేశాలు స్నేహంతో మెలగాలని తాను కోరుకుంటున్నానని, ఇకపై ఇరాన్‌ దేశపు అంతర్గత వ్యవహారాలలో తాము తలదూర్చేది లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

గతంలో 1979 నవంబర్ నాలుగున దౌత్యకార్యాలయంపై ఆక్రమణ జరిగిందని, అక్కడ 444 రోజులపాటు అమెరికన్ పౌరులను నిర్బంధించారని, దీనికి తమ పౌరుల సేవలు, త్యాగం చిరస్మరణీయమని ఆయన కొనియాడారు.

అప్పుడు ఇరాన్‌లో జరిగిన సంఘటన కారణంగా తమకు వారిపై అవిశ్వాసం, అపనమ్మకం కలిగాయని, ఇకపై తాము అలా ఉండదలచుకోలేదని, వారితో చెలిమికి తాము సిద్ధమని ఆయన అన్నారు.

ఇదిలావుండగా ఒబామా ప్రసంగాన్ని ఇరాన్ దేశపు ప్రధాన భాష అయిన పారసీలోను అనువాదం చేసి ప్రసారం చేసినట్లు వైట్‌హౌస్ అధికార వర్గాలు వెల్లడించాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.