జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » మరోమారు భారతీయ విద్యార్థిపై దాడి (Austalia | India | Student | Amruth Goel | Australian industrial systems institute)
Feedback Print Bookmark and Share
 
ఆస్ట్రేలియాలో మరోమారు భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. అమృత్ గోయల్(36) అనే విద్యార్థిపై ఆస్ట్రేలియన్లు మూకుమ్మడి దాడి చేశారు.

ఇంజనీరింగ్ చదువుతున్న అమృత్ ఆస్ట్రేలియాలోనున్న ఆస్ట్రేలియన్ ఇండస్ట్రియల్ సిస్టమ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థలో చదువుతున్నాడని, ఇతనిపై లావర్టాన్ ప్రాంతంలో మంగళవారం దాడి జరిగిందని ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు అమిత్ మేగ్నానీ చెప్పారు.

అమృత్ తన ఇంటి బయటవుండగా ఇద్దరు పురుషులు, ఓ మహిళ జాతి వివక్ష వ్యాఖ్యలతోపాటు పరుషపదజాలంతో అతనిపై దాడులకు పాల్పడ్డారని మెగ్నానీ పేర్కొన్నారు.

ఈ దాడిలో అతని ఎడమ కంటికి తీవ్ర గాయమైందని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.