జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » పోలీసులను కాల్చి చంపిన పోలీసు అధికారి (Afghanisthan | Police Official | Check Post | Pistol | Bullets)
Feedback Print Bookmark and Share
 
ఆఫ్గనిస్థాన్‌లో ఓ పోలీసు అధికారి ఆఫ్గన్‌లోని ఓ చెక్‌పోస్ట్ వద్ద విధినిర్వహణలోనున్న ఐదుగురు పోలీసులను తనవద్దనున్న తుపాకీతో కాల్చి చంపాడు.

ఆఫ్గనిస్థాన్ దేశంలోని ఓ చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఐదుగురు బ్రిటిష్ సైనికులపై ఆ దేశానికి చెందిన ఓ పోలీసు అధికారి తూటాల వర్షం కురిపించాడు. దీంతో వారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

వీరిలో గ్రెనేడియర్ గార్డ్స్‌కు చెందిన ముగ్గురు, రాయల్ మిలిటరీకి చెందిన ఇద్దరు జవాన్లున్నారని, ఈ సంఘటన మంగళవారం దక్షిణ ఆఫ్గనిస్థాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్‌‍‌లో జరిగిందని బ్రిటన్ రక్షణ శాఖ బుధవారం వెల్లడించింది.

కాల్పులకు పాల్పడ్డ పోలీసు అధికారిని పట్టుకునేందుకు తాము ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని, అతను ఎందుకు అలాంటి చర్యకు పాల్పడ్డాడో వివరాలు తెలియరాలేదని బ్రిటన్ రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.