ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » శ్వేతసౌధం అధ్యక్షుడిగా ఒబామాకు ఏడాది పూర్తి! (America | President | Obama | Elected | One Year | World | Unemployment)
అమెరికా అధ్యక్షుడిగా నల్లజాతి సూరీడు బరాక్ ఒబామా ఎన్నికై నేటికి ఒక ఏడాది పూర్తికానుంది. ఈ 12 నెలల కాలంలో ఒబామా సాధించిన విజయాలపై అటు స్వదేశంలో పాటు.. ప్రపంచ దేశాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
శ్వేతసౌధం అధ్యక్షుడిగా ఒబామా ఎన్నికయ్యే సమయానికి అమెరికాను ఆర్థిక సంక్షోభం పట్టి పీడిస్తోంది. గత ఏడాది కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకున్నా 10 శాతానికి పైగా నిరుద్యోగ సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ సమస్యల మున్ముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికలు, సర్వేలు హెచ్చరిస్తూనే ఉన్నాయి.
అమెరికలోని నిరుద్యోగులు ఉపాధి కోసం ఇతర దేశాలకు సైతం వలస పోతున్నారు. మరికొందరు స్వదేశంలోనే ఉంటూ ఉపాధి కోసం వెంపర్లాడుతున్నారు. గత ఏడాది కాలంలో లక్షలాది ఉపాధి అవకాశాలు కల్పించడమో, రక్షించడమో చేశామన్న ఒబామా అధికార యంత్రాంగం వాదనను ప్రత్యర్థి రిపబ్లికన్ నేతలు కొట్టి పారేస్తున్నారు. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఏడాది పూర్తి కాలాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.