ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » వజీరిస్థాన్‌లో భారత్ తయారీ బాంబులు: పాకిస్థాన్ (Vaziristhan | India | Bombs | Pakistan | Forign Affairs | SMKrishna)
దక్షిణ వజీరిస్థాన్‌లో భారత్‌లో తయారైన బాంబులు తమ దేశ సైన్యానికి లభ్యమయ్యాయని పాకిస్థాన్ విదేశాంగ ప్రతినిధి అబ్దుల్ బాసిత్ ఖాన్ వెల్లడించారు. ఈ బాంబులను త్వరలోనే భారత అధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ ఆరోపణలను భారత్ వెంటనే తోసిపుచ్చింది.
దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వజీరిస్థాన్‌లో చోటు చేసుకుంటున్న అల్లర్లు, ఘర్షణల వెనుక భారత హస్తం ఉందనడానికి ఎన్నో ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. వీటిని స్థానిక అధికారులు సరిచూస్తున్నారనీ, ఆ తరువాత ఆ ఆధారాలను భారత ప్రభుత్వానికి అందజేస్తామని ఖాన్ తెలిపారు.
ఈ ఆరోపణలపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎం.కృష్ణ ఖండించారు. వజీరిస్థాన్‌లో నెలకొన్న అశాంతి వెనుక భారత్ ప్రమేయం ఉందని, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయంటూ పాక్ ఆరోపణలు నిరాధారమని తేల్చి చెప్పారు. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహరాల్లో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు.