ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » పాక్ సైన్యం దాడిలో గాయపడిన తాలిబన్ నేత ఫజులుల్లా!? (Pak | Militery | Taliban | Fazululla | Radical | Attacks | Afghanistan)
పాక్ సైన్యం దాడిలో గాయపడిన తాలిబన్ నేత ఫజులుల్లా!?
శుక్రవారం, 6 నవంబర్ 2009( 09:59 IST )
ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దులోని గిరిజ ప్రాబల్య ప్రాంతంలో తిష్టవేసి విధ్వంసం సృష్టిస్తున్న తాలిబన్ తీవ్రవాదులపై పాక్ సైన్యం చేపట్టిన దాడులు సత్‌ఫలితాలను ఇస్తున్నాయి. తాజాగా జరిపిన దాడుల్లో తాలిబన్ అగ్రనేత, రాడికల్ మత గురువు మౌలానా ఫజులుల్లా గాయపడినట్టు ఆ దేశ మంత్రి ఒకరు వెల్లడించారు. అంతేకాకుండా, ఆయన ఉండే స్థావరాన్ని కూడా సైన్యం చుట్టిముట్టిందని తెలిపారు.
ఈ దాడుల్లో తెహ్రిక్ ఇ తాలిబన్ అగ్ర నాయకత్వం అరెస్టు కావడంగాని, మరణించడంగాని జరిగిందని, స్వాత్ లోయలో 80 శాతం మేరకు పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చిందని వాయవ్య ఫ్రాంటియర్ ప్రావిన్స్ మంత్రి బషీర్ అహ్మద్ బిలౌర్ తెలిపినట్టు ఒక ఆన్‌లైన్ వార్తా సంస్థ పేర్కొంది.
సైన్యం మంగ్లవార్ ప్రాంతంలో జరిపిన గాలింపు చర్యల్లో ఉమర్ జాదా, మహ్మద్ రెహమాన్ అనే ఉగ్రవాదులు లొంగిపోయినట్టు స్థానిక అధికారులు వెల్లడించినట్టు ది న్యూస్ పత్రిక పేర్కొంది. వీరితో పాటు.. ఫజ్లులుల్లాకు అత్యంత సన్నిహితులుగా చెలామణి అయ్యే నెక్‌జాదా, సైఫుల్లాలను కూడా సైన్యం అరెస్టు చేసినట్టు సమాచారం.