ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » అమెరికాలో సైనికుని కాల్పులు: 11 మంది మృతి (America | Texas | Fort Hud | Army | Fire | Major | Psychologist | Nidal Malik Hasa)
అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలోని కిలీన్ పట్టణానికి ఆవలవున్న ఫోర్ట్ హుడ్ సైన్యానికి చెందిన కేంద్రంపై విదేశాలకు వెళ్ళేందుకు సిద్ధంగావు్న్న సైనికులపై ఓ సైనికుడు తన వద్దనున్న తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో అక్కడికక్కడే 11 మంది మృతి చెందగా మరో 31 మంది కి తీవ్ర గాయాలైనాయి.
దాడులకు సంబంధించి సైన్యాధికారులు మాట్లుడుతూ... కాల్పులకు పాల్పడ్డ సైనికుని మానసిక పరిస్థితి సరిగా లేనందున ఈ దుర్ఘటన జరిగిందని, సైనికుని పేరు మేజర్ నిదాల్ మలిక్ హసన్‌గా పేర్కొన్నారు.
దాడులకు పాల్పడ్డ సైనికుని సోదరుడు మాట్లాడుతూ... అతనిని మేజర్‌గా ఇరాక్‌లో నియమించారని, దానికి అతను తొలి నుంచి విరోధిస్తున్నాడని ఆయన అన్నారు.
కాల్పులకు పాల్పడ్డ సైనికుడు భారత సమయానుసారం గురువారం అర్థరాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో సైనికుల కేంద్రంపై దాడులకు పాల్పడ్డాడని, ఆ సమయంలో విదేశాలకు చేరుకునేందుకు తమ సైనికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సైనికాధికారి ఒకరు తెలిపారు.
ఈ సందర్భంగా ఫోర్ట్ హుడ్‌కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట జనరల్ రాబర్ట్ కోన్ మాట్లాడుతూ... కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి పోలీసుల చేతిలో తీవ్ర గాయాలపాలైనాడని, ప్రస్తుతం అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించామని ఆయన అన్నారు.
కాల్పుల్లో అతనికి చాలా బుల్లెట్లు తగిలాయని, కాని దానికి ముందే ఓ పోలీసు అధికారిని కాల్చి చంపాడన్నారు. ఇదిలావుండగా కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి మేజర్ హసన్ సైనిక మానసిక వైద్యుడు. అతను పలు రకాలుగా మానసికపరమైన ఇబ్బందులతో బాధపడేవారికి చికిత్స అందిస్తుంటాడని ఆయన వివరించారు.
భారత కాలమానం ప్రకారం గత అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనపై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ... కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని విచారించాలని, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తనకు పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కాగా ఫోర్ట్ హుడ్‌లో దాదాపు 50 వేలమంది సైనికులున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో అక్కడ దాదాపు 35 వేలమంది సైనికులున్నారని టెక్సాస్‌కు చెందిన సెనేటర్ కాయ్ బైలీ హచీససన్ తెలిపారు.