జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ప్రజలపైకి దూసుకెళ్ళిన ట్రక్కు: 19 మది మృతి (North Chaina | Hebeyee | People | Truck | Brake | Failed)
Feedback Print Bookmark and Share
 
ఉత్తర చైనాలోని హేబేయీ ప్రాంతంలో ఓ ట్రక్కు ప్రజలపైకి దూసుకెళ్ళింది. దీంతో అక్కడికక్కడే 19 మంది మృతి చెందారు.

ఉత్తర చైనాలోని హేబేయీ ప్రాంతంలో ఓ ట్రక్కు ప్రజలపైకి దూసుకెళ్ళింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారని, మరో 13 మందికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక భద్రతాధికారి ఒకరు తెలిపారు

ట్రక్కు బ్రేకులు పెయిల్ అవడంతో ఈ దుర్ఘటన జరిగిందని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు స్థానిక పోలీసులు వివరించారు. దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించామని ఆయన అన్నారు.

ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు ట్రక్కు యజమానిని అదుపులోకి తీసుకున్నామని దుర్ఘటనకు సంబంధించి విచారణ చేపట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.