ఘాటైన భారతీయ వంటకాలు.. స్వైన్ ఫ్లూతో సహా సాధారణ జలుబు మరియు ఇతరత్రా వ్యాధులను నియంత్రించే శక్తిని కలిగి ఉన్నాయంటూ.. రష్యా వైద్యులు తాజాగా వెల్లడించారు. అల్లం, పసుపులతో తయారైన ఘాటైన కూరలు.. మనుష్యుల్లో రోగనిరోధక శక్తిని మరింతగా పెంపొందిస్తున్నట్లు తాము గుర్తించామని వారు అంటున్నారు.
రష్యాలో మాస్కో నగరంలో యాంటీ ఎపిడెమిక్స్ కమిటీకి చెందిన ఓ అత్యున్నత అధికారి ఈ విషయాలను వెల్లడించారు. అయితే పేరు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ప్రతిదానికి మందుల షాపు కెళ్లి మందులను కొనే బదులు ఘాటైన వంటకాలు వాటికి ప్రత్యామ్నాయ మార్గంగా తెలిపారు.
ప్రత్యేకించి వర్షాకాలంలో వేగంగా వ్యాప్తి చెందే వ్యాధులు మరియు స్వైన్ ఫ్లూ.. తదితరమైనవి.. తూర్పు ప్రాంతపు దేశాల్లో ఎక్కువగా ఉందన్నారు. వ్యాధుల రాకుండా నియంత్రించేందు కోసం.. ఘాటైన ఆహారంలో.. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం వంటివి ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. ఇవి ఎలాంటి వ్యాధిక కారకాలతోనైనా.. పోరాడే శక్తిని దేహానికి ఇస్తాయని ఆయన తెలిపారు.
కాగా, ప్రస్తుతం ఇక్కడ స్వైన్ ఫ్లూ నియంత్రణలో భాగంగా.. ప్రతి ఒక్కరూ మాస్క్‌ను ధరించాల్సిందిగా ఉక్రెయిన్ సహా వివిధ దేశాలు ఆదేశాలు జారీ చేశాయన్నారు.