ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » నేపాల్ అనిశ్చితి: ఐరాస ప్రతిపాదనకు ససేమిరా! (Nepal | UN | Ban Ki Moon | Govt | Moists | Prachanda | Koirala)
నేపాల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు ఐక్యరాజ్య సమితి చేసిన చర్యలు మరోమారు విఫలమయ్యాయి. ఐసార ప్రతిపాదనను అధికార కూటమి అగ్రనేతలు తోసిపుచ్చారు. ఫలితంగా సమైక్య ప్రభుత్వ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది.
నేపాల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు జాతీయ సమైక్య ప్రభుత్వ ఏర్పాటు ఏకైక మార్గమని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ చేసిన ప్రతిపాదనను ఆ దేశ అధికార కూటమి తోసిపుచ్చింది.
తమ దేశంలో ఎలాంటి ప్రభుత్వం ఉండాలో.. ఎవరు నాయకత్వం వహించాలో తేల్చేది దేశ ప్రజలేనని, ఇందులో ఇతరుల జోక్యాన్ని సహించబోమని పాలక పక్షం నేతలు తేల్చి చెప్పారు. అలాగే, దేశంలో ఎలాంటి పాలనాయంత్రాంగం ఏర్పాటు చేయాలన్న అంశం కూడా తమ పరిధిలోనిదే అని స్పష్టం చేశారు.
తమ దేశ అంతర్గత సమస్యలను అంతర్గతంగానే చర్చించి పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇందుకోసం అన్ని పార్టీలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధికార కూటమి తెలిపింది. ముఖ్యంగా, ప్రస్తుత ప్రభుత్వంలో మావోయిస్టులు చేరేందుకు సుముఖంగా ఉంటే వారికి తగిన ప్రాధాన్యత కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు నేతలు వెల్లడించారు.