జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » కూలిన రష్యా మిలిటరీ విమానం: 9 మంది మృతి (Russia | Plane | Crash | Militery | Training flight | Defense)
Feedback Print Bookmark and Share
 
రష్యా మిలిటరీకి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న తొమ్మిది మంది సిబ్బంది మరణించినట్టు న్యూస్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. దీనిపై రష్యా ఎమర్జెన్సీ మంత్రిత్వ శాఖ అధికారి స్పందిస్తూ.. టు-142-ఎం3 యాంటి సబ్‌మెరైన్ టర్బోప్రాబ్ రకానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ ఒకటి టాటార్‌స్కై గురువారం కూలిపోయింది. టాటార్‌స్కై ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ సముద్రంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు.

ఈ ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయే ముందు రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని డిఫెన్స్ అధికారులు వెల్లడించినట్టు ఇంటెర్‌ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. సముద్రజలాల్లో పడిన మృతదేహాలను ఎమర్జెన్సీ బోట్లలోని సిబ్బంది వెలికి తీశాయని పేర్కొంది. టు-142-ఎం3 రకానికి చెందిన నౌకాదళ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఎక్కువగా సోవియట్ నేవీ ఉపయోగిస్తూ ఉంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.