జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఫ్లోరిడాలో కాల్పులు: ఇద్దరి మృతి (Florida | Orlando | Unknow Person | Employee | Gate Way Center)
Feedback Print Bookmark and Share
 
ఫ్లోరిడాలోని ఓర్‌లాండోలో శుక్రవారం ఓ అజ్ఞాత వ్యక్తి నగరంలోని ఓ భవంతిలోకి వెళ్ళి కాల్పులకు పాల్పడ్డాడు. ఇందులో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

ఓర్‌లాండో నగరంలోని గేట్‌వే సెంటర్‌లోకి ఓ అజ్ఞాత వ్యక్తి దూసుకెళ్ళి కాల్పులకు పాల్పడ్డాడని, ఇందులో ఇద్దరు మృతి చెందగా చాలామందికి తీవ్ర గాయాలైనట్లు పోలీసు అధికారులు తెలిపారు.

స్థానిక మీడియా కథనం మేరకు ఇద్దరు మృతి చెందారని, శవాలు ఎనిమిది, 12వ అంతస్తులో ఉండవచ్చని మీడియా తెలిపింది.

దాడులకు పాల్పడ్డ వ్యక్తి అదే భవంతిలోని ఓ కార్యాలయంలో పని చేస్తున్నాడి, ప్రస్తుతం తాము భవంతిని ఖాళీ చేసామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.