ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » బరాక్ ఒబామా జపాన్ పర్యటన వాయిదా (News| International| Barack Obama| Fort Hood| US Shoot| Texas Army post)
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జపాన్ పర్యటన వాయిదా పడింది. టెక్సాన్ సైనిక శిబిరంలో జరిగిన కాల్పుల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకుగానూ ఈ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. దీంతో ఒబామా వచ్చేవారం జపాన్‌కు వెళ్లే అవకాశం ఉందని వైట్‌హౌస్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
గురువారం టెక్సాస్ సైనిక శిబిరంలో జరిగిన కాల్పులపై శుక్రవారం ఎఫ్‌బీఐ డైరక్టర్ రాబెర్ట్ ముల్లర్‌తో పాటు ఉన్నత సైనికాధికారులతో ఒబామా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో భాగంగా కాల్పుల సంఘటనపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ.. టెక్సాస్ సైనిక శిబిరంలో జరిగిన కాల్పుల్లో 30మంది మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సైనిక ఉన్నతాధికారిక సిబ్బంది జరిపే విచారణకు ప్రజలు సహకరించాలని ఒబామా పిలుపు నిచ్చారు.