ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఆల్‌ఖైదా వీడియోలను స్వాధీనపరుచుకున్న ఎఫ్‌బీఐ (Al Qaeda videos | FBI | America | Rana | Bin Laden | Terrorists)
భారత్‌లోని వివిధ కీలక ప్రాంతాల్లో లష్కరే తోయిబా దాడులకు సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ.. ఆల్‌ఖైదాకు సంబంధించిన రెండు కీలక వీడియోలు ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) స్వాధీన పరుచుకుంది. గత నెలలో అరెస్ట్ అయిన పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా వాస్తవ్యుడు తహావూర్ హుస్సేన్ రాణా ఇంటిలో ఈ వీడియోలు లభ్యమయ్యాయి.
స్వయంగా రాణా ఇంటి నుంచి ఈ వీడియోల్లో ఆల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ మరియు ఇతర ఉగ్రవాదులచే రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఉన్నట్లు తెలిసింది. ఆల్‌ఖైదా మీడియా విభాగంగా సుపరిచితమైన 'అస్ సాహెబ్ మీడియా' ద్వారా ఈ వీడియోలను తయారు చేశారు. వీటిల్లో ఒకటి 'బాంబింగ్ ఆఫ్ డెన్మార్క్' అనే వీడియో టైటిల్ కలిగి ఉంది.
ఈ వీడియోలను.. గత దశాబ్ధ కాలంగా చికాగోలో నివాసముంటున్న 48 ఏళ్ల రాణా ఇంటి నుంచి ఎఫ్‌బైఐ స్వాధీన పరుచుకుంది. న్యూఢిల్లీలోని జాతీయ సైనిక కళాశాలపై దాడులకు కుట్ర పన్నారు. డేవిడ్ కోల్‌మేన్ హెడ్లేతో కలిగి రాణాకు ఈ దాడులకు ప్రణాళిక చేశారు. ఇంతలో ఎఫ్‌బీఐ ఈ కుట్రను భగ్నం చేసిన విషయం తెలిసిందే.