జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » 2020 నాటికి గల్ఫ్ దేశాల జనాభా 53 మిలియన్లు! (Dubai | GCC | Gulf | Economist | Population | World | Research)
Feedback Print Bookmark and Share
 
ప్రపంచంలో జనాభా వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలుగా గల్ఫ్ దేశాలు గుర్తింపుపొందాయి. వచ్చే 2020 సంవత్సరం నాటికి ఈ దేశాల మొత్తం జనాభా 53 మిలియన్లకు చేరుకోనుంది ది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) వెల్లడించింది. తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం నిరూపితమైంది.

"ది జీసీసీ ఇన్-2020" పేరుతో ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ సర్వే నిర్వహించింది. అదే సమయంలో గల్ఫ్ దేశాలతో పాటు.. ఆయా దేశాల ప్రజలు తమ భవిష్యత్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నట్టు పేర్కొంది.

అంతేకాకుండా, ప్రపంచంలో ఎక్కువ మంది యువత గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారు. ఈ యువకుల విద్యాభ్యాసం, ఉపాధి అవకాశాలపై ఆ దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ఈ సర్వే వెల్లడించింది.

దేశంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఉద్యోగాల పట్ల మహిళలు ఎక్కువ సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. దీనికి ప్రధాన కారణంగా మహిళల్లో ఎక్కువ మంది విద్యావంతులు కావడమేనని ఆ సర్వే పేర్కొంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.