జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » చైనా-తైవాన్ సంబంధాలపై బరాక్ ఒబామా హర్షం! (China | Barack Obama | Global problems | Taiwan ties | One China Policy)
Feedback Print Bookmark and Share
 
ఇటీవలి కాలంలో చైనా, తైవాన్‌ల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడటం పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ఇందులో అమెరికా నినాదమైన "వన్ చైనా" పాలసీని మార్చుకోవాల్సిన పని లేదన్నారు. తమ నాయకత్వంలోని పాలనాయంత్రాంగం వన్ చైనా విధానానికి పూర్తి మద్దతిస్తుందని స్పష్టం చేశారు.

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చైనా పర్యటనకు తొలిసారి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా షాంఘైలోని చైనా విశ్వవిద్యాలయం విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రంలో పాల్గొన్న ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా-తైవాన్‌ల మధ్య సంబంధాలు బాగా మెరుగుపడ్డాయని, అందువల్ల తమ విధానం లేదా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ముఖ్యంగా ఇరు ప్రాంతాల మధ్య ఉద్రిక్తలు తగ్గడం హర్షణీయమన్నారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఈ ప్రాంతాల మధ్య ఉద్రిక్తలను తగ్గేందుకు ఎంతగానే దోహదపడ్డాయన్నారు. ఇరు ప్రాంతాల మధ్య ఇదే తరహా సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు ఒబామా పేర్కొన్నారు. కాగా, చైనా చారిత్రాత్మక పర్యటనకు ఒబమా సోమవారం నుంచి శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే.

ఈ పర్యటనలో భాగంగా ఆయన పర్యటించే ప్రాంతాలు, ప్రదేశాల్లో కనీవినీ ఎరుగని రీతిలో సాయుధ బలగాలను మొహరించారు. ఆయనతో సమావేశమయ్యే మీడియా ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతి ఇస్తున్నారు. అంతేకాకుండా ఒబామా ఈ పర్యటనలో బీజింగ్‌లోని చారిత్రక రాజభవనాలు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఇతర ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు, ప్రాంతాలను సందర్శిస్తారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.