జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ముంబై కుట్రదారులతో హెడ్లీ, రాణాలకు సంబంధాలు! (Mumbai attacks | Rana | Headly | America | FBI | NIA | Investigation)
Feedback Print Bookmark and Share
 
దేశ వాణిజ్య రాజధాని ముంబైపై దాడులు జరిపేందుకు కుట్రపన్నిన సూత్రధారులతో లష్కర్ తోయిబా తీవ్రవాదులైన డేవిడ్ హెడ్లీ, రాణాలకు సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ ఇద్దరు తీవ్రవాదుల వద్ద ఎఫ్‌బీఐ జరుపుతున్న విచారణలో కొత్తకొత్త విషయాలు వెలుగు చూస్తున్న విషయం తెల్సిందే.

కాగా, ముంబైలో మారణహోమం సృష్టించేందుకు వీరిద్దరు యధేచ్చగా రెక్కీ నిర్వహించినట్టు సమాచారం. అలాగే ముంబైలో దాడులకు అయిదు రోజుల ముందు రాణా ముంబైలోనే ఉన్నట్లు తేలడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. పాకిస్థాన్‌కు చెందిన కెనడియన్‌ పౌరుడు రాణా వివరాల కోసం భారత్‌ కెనడా ప్రభుత్వాన్ని సంప్రదించింది. ముంబైలో 26/11 తర్వాత జరిగిన పరిణామాలపై జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన 20 ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి.

కాగా, ముంబైలో బసచేసిన హెడ్లీ ముంబైలోని అమెరికా కాన్సులేట్‌కు అతి సమీపంలోని నివశించినట్టు తాజాగా వెల్లడైంది. దక్షిణ ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ప్రాంతంలో ఉన్న భవనంలో అయిదో అంతస్తులో హెడ్లీ ఉండే వాడని, 2008 ఏప్రిల్‌ వరకు దాదాపు సంవత్సరం పాటు అక్కడ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.