జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » చైనా అభిప్రాయాలను ప్రధానితో పంచుకోనున్న ఒబామా (Obama | share | impressions | China | visit | India | White House | PM)
Feedback Print Bookmark and Share
 
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న తర్వాత తన పర్యటనలో చోటు చేసుకున్న కీలక పరిణామాలతో పాటు తన అభిప్రాయాలను భారత్‌తో పంచుకోనున్నారు. కాగా, వచ్చే వారంలో ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు.

ఈ సందర్భంగా బరాక్ ఒబామా తన చైనా పర్యటన వివరాలు, మనస్సులోని అభిప్రాయాలు, ఆలోచనలను ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పంచుకుంటారని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి ఇయాన్ కెల్లీ తెలిపారు. ఈ యేడాది జనవరిలో శ్వేతసౌధంలో ఒబామా అడుగు పెట్టిన తర్వాత అమెరికాలో పర్యటిస్తున్న తొలి ప్రభుత్వాధి నేత మన్మోహన్ సింగ్ కావడం గమనార్హం.

ఈ సందర్భంగా ప్రధానికి వైట్‌హౌస్‌లో ఒబామా దంపతులు విందు కూడా ఇవ్వనున్నారు. దీనిపై ఇయాన్ కెల్లీ మాట్లాడుతూ.. చైనా నుంచి స్వదేశానికి చేరుకునే అధ్యక్షుడు పలు అంశాలపై స్పష్టమైన దృక్పథంలో ఉంటారు. ముఖ్యంగా, వాషింగ్టన్‌కు వచ్చే భారత ప్రధానితో తన చైనా పర్యటన వివరాలను తప్పకుండా పంచుకుంటారని అభిప్రాయపడ్డారు. కాగా, ఈనెల 24వ తేదీన ప్రధాని మన్మోహన్ సింగ్, బరాక్ ఒబాల భేటీ వైట్‌హౌస్‌లో జరుగనుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.