ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో పెకిలించివేస్తాం: గిలానీ (Pak Army | Terrorists | Pakisthan | PM | Gilani | Dera Ismail Khan)
ప్రస్తుతం తమ దేశంలో పాక్ ఆర్మీని చూసి ఉగ్రవాదులు పారిపోతున్నారని, దీంతో దేశంలో శాంతిని స్థాపించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోను వదిలే ప్రసక్తే లేదని, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తామని పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ అన్నారు.
పాక్‌లోని వాయువ్యప్రాంతమైన డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతాన్ని గిలానీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఉగ్రవాదులు ఇప్పుడు తమ దేశ సైనికులను చూసి పారిపోతున్నారని, ఉగ్రవాదాన్ని తాము కూకటివేళ్ళతో పెకిలించివేస్తామని ఆయన తెలిపారు.
దక్షిణ వజీరిస్థాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులపై తమ సైన్యం జరుపుతున్న పోరాటంతో ఉగ్రవాదులు పరుగులు పెడుతున్నారని, ఇది తమకెంతో సంతోషంగా ఉందని, ఉగ్రవాద స్థావరాలను తమ సైన్యం పట్టు సాధిస్తుండటంతో తమ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోనున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.