ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » మన్మోహన్ పర్యటన ఏర్పాట్లపై వైట్‌హౌస్ బిజిబిజీ! (White house | working | agenda | Prime Minister | Singh | visit | Obama)
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేపట్టనున్న అమెరికా పర్యటన కోసం అగ్రదేశ అధికార పరిపాలనా భవమైన వైట్‌హౌస్ ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమైవుంది. దీంతో వైట్‌హౌస్ అధికారులు బిజిబిజీగా గడుపుతున్నారు. ఈనెల 24వ తేదీన ప్రధాని మన్మోహన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలు వైట్‌హౌస్‌లో సమావేశం కానున్న విషయం తెల్సిందే.
ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లలో శ్వేతసౌధం అధికారులు నిమగ్నమై ఉన్నారు. అంతేకాకుండా, మన్మోహన్-ఒబామాల మధ్య జరిగే చర్చల అజెండా ఖరారుపై కూడా వారు కసరత్తు చేస్తున్నారు.
దీనిపై అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి ఇయాన్ కెల్లీ మాట్లాడుతూ.. రాజకీయ వ్యవహారాల సహాయ మంత్రి విలియం జె బర్న్స్ చర్చల అంశానికి సంబంధించి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారన్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సుస్థిరంగా నిలిచి పోతుందన్నారు. అందుకే ఈ సందర్భంగా ఉండాల్సిన అంశాలపై భారీస్థాయిలోనే వ్యూహ రచన చేస్తున్నట్టు కెల్లీ తెలిపారు.