ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » సరిహద్దు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్: హిల్లరీ (Terrorism | Pak | Afghanistan | Hillory Clinton | America | Terrorist)
సరిహద్దు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్: హిల్లరీ
శుక్రవారం, 20 నవంబర్ 2009( 15:53 IST )
దక్షిణాసియాలో సరిహద్దు తీవ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఆరోపించారు. అమెరికాకు చెందిన ఒక రేడియో సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పైవిధంగా విమర్శలు చేశారు. పాకిస్థాన్ సరిహద్దు తీవ్రవాదంతో పాటు.. తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిందనే విషయం తమకు తెలుసన్నారు.
ఇంతకాలం ఆఫ్ఘనిస్థాన్‌లో మనుగడ సాగించిన తీవ్రవాదులు/ఉగ్రవాదులపై అమెరికా సైనిక బలగాలు తీవ్రస్థాయిలో దాడులు సాగిస్తున్నాయన్నారు. ఈ దాడుల నుంచి తప్పించుకునేందుకు తీవ్రవాదులు పాకిస్థాన్‌కు వెళ్లి ఆశ్రయం పొందుతున్నారని అన్నారు. దీంతో పాకిస్థాన్‌లో ఇటీవలి కాలంలో తీవ్రవాద దాడులు ఎక్కువయ్యాయని చెప్పుకొచ్చారు.
వీరిని అదుపు చేయడం పాక్ ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారిందన్నారు. పాకిస్థాన్‌కు ముప్పుగా మారిన తీవ్రవాదులను పాక్ భద్రతా బలగాలు అరికట్టలేక పోతున్నాయని చెప్పుకొచ్చారు. ఇదే పరిస్థితి ఆఫ్ఘనిస్థాన్‌లోనూ చోటు చేసుకుందన్నారు. అందువల్ల ఈ రెండు దేశాలను తాము ఒకే కోణంలో చూస్తున్నట్టు హిల్లరీ క్లింటన్ చెప్పుకొచ్చారు.