ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుడు: 25 మంది దుర్మరణం (Suicide | bombers | injure | Afghanistan | Herat | Kabul)
ఆఫ్ఘనిస్థాన్ మరోమారు బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లింది. ఆ దేశ అధ్యక్షుడిగా హమీద్ కర్జార్ రెండో సారి బాధ్యతలు స్వీకరించిన రోజే తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది.
ఫరా రాష్ట్ర రాజధాని హెరాత్‌లోని గవర్నర్ నివాసానికి సమీపంలో ఒక ఆత్మాహుతిదళ సభ్యుడు తనను తాను పేల్చుకున్నాడు. మోటార్ సైకిల్‌పై జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతానికి దూసుకొచ్చి పేల్చుకున్నాడు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారంతా సాధారణ పౌరులేనని హెరాత్ గవర్నర్ రోహుల్ అమీన్ వెల్లడించారు.
అలాగే, ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ శివారు ప్రాంతమైన ఖాజా ముసాఫిర్ అనే ప్రాంతంలో అబ్దుల్ రసూల్ అనే వివాదాస్పద యుద్ధప్రభువును లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడి నుంచి అబ్దుల్ రసూల్ మాత్రం సురక్షితంగా తప్పించుకోగా, ఆయన అంగరక్షలు మాత్రం దుర్మరణం పాలయ్యారు.