జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » గ్లోబల్ సమస్యగా రోడ్డు ప్రమాదాలు: బాన్ కీ మూన్ (Road accident | Global crisis | UN chief | Mascow | New York | Malaria)
Feedback Print Bookmark and Share
 
ప్రపంచ వ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అభిప్రాయపడ్డారు. ఒకవిధంగా ఇది గ్లోబల్ సమస్యగా మారిందని ఆయన అన్నారు. ఈ ప్రమాదాల కారణంగా ప్రతియేడాది ఒక మిలియన్‌ మందికి పైగా ప్రజలు ప్రాణాలు దుర్మరణం పాలవుతున్నట్టు మూన్ చెప్పారు.

మాస్కోలో రోడ్డు భద్రతపై అంతర్జాతీయ మంత్రుల స్థాయి సదస్సు తొలి సారి జరుగుతోంది. ఇందులో ఆయన పాల్గొని ప్రసంగించారు. తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు చెప్పారు. ప్రతి యేడాది సుమారుగా ఒక మిలియన్ ప్రజల కంటే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారన్నారు.

ఈ సంఖ్య మలేరియా, డయాబెటీస్ వ్యాధుల వల్ల మరణించే వారి సంఖ్య కంటే ఎక్కువగా ఉందని ఆయన వివరించారు. అలాగే, రోడ్డు ప్రమాదాల కారణంగా మరో 50 మిలియన్ల ప్రజలు గాయాలబారిన పడుతున్నారని తెలిపారు.

ఈ ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలతో సహా, వాహన ఉత్పత్తిదారులు, పబ్లిక్, ప్రైవేట్ దాతలు, ఎన్జీవో సంస్థలు, నిపుణులు కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం సురక్షితమైన రోడ్లను నిర్మించాలని కోరారు. రోడ్ల నిర్మాణం కోసం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.