జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » శ్వేతసౌధానికి విశిష్ట అతిథులుగా అభి-ఐష్! (White House | Abhi-Ish | PM | America | Obama | Anil Ambani)
Feedback Print Bookmark and Share
 
File
FILE
అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇచ్చే ఆతిథ్యానికి టాప్-10 ప్రతినిధులను వైట్‌హౌస్ ప్రతినిధులు ఎంపిక చేశారు. వీరిలో భారత్ నుంచి ప్రధాని కాకుండా, ఐదుగురు ప్రముఖులకు చోటు దక్కింది. అలాగే, భారత సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ కూడా ఉన్నారు.

నాలుగు రోజుల అధికారిక పర్యటనకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వాషింగ్టన్‌కు బయలుదేరి వెళ్లిన విషయం తెల్సిందే. ఆయనకు అమెరికా అధ్యక్షుడు ఒబామా తన అధికారిక నివాసమైన శ్వేతసౌధంలో ఈనెల 24వ తేదీన విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం టాప్-10 విశిష్ట ప్రముఖులను వైట్‌హౌస్ ఎంపిక చేసింది.

ఈ జాబితా తాజాగా వెల్లడైంది. ఇందులో భారతీయ చిత్రపరిశ్రమ ప్రతినిధులుగా బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యాయ్ బచ్చన్‌లకు చోటు దక్కింది. అలాగే, భారతీయ కుబేరుడు అనిల్ అంబానీ, ప్రముఖ సంఘకర్త, రచయిత్రి అరుంధతీ రాయ్, పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్, జాతిపిత మహాత్మా గాంధీ మనుమడైన గోపాలకృష్ణ గాంధీలు ఉన్నారు.

వీరితో పాటు.. భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడు బాబీ జిందాల్ మరికొంత మంది ప్రపంచ ప్రముఖులకు చోటు దక్కడం గమనార్హం. ఈ పది మంది విశిష్ట అతిథులతో కలిసి ఒబామా దంపతులు, మన్మోహన్ సింగ్ దంపతులు విందు భోజనం ఆరగిస్తారు. ఇందుకోసం వైట్‌హౌస్ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.