ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » 26/11 పేలుళ్లు: ఇటలీలో మరో ఇద్దరి అరెస్టు (London | Two Pakistani nationals | Mumbai | Terror attacks | Italy)
గత ఏడాది వాణిజ్య రాజధాని ముంబయిపై జరిగిన ఉగ్రవాద దాడులతో సంబంధమున్న మరో ఇద్దరు పాకిస్తాన్ దేశస్తులను ఇటలీలో అరెస్టు చేశారు. ఇటలీలోని బ్రెశియా పట్టణంలోని ఉత్తరప్రాంతంలో వీరిరువురినీ అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్‌కు చెందిన స్కై రిపోర్టు వెల్లడించింది.
అరెస్టయిన ఇద్దరు వ్యక్తులు ముంబయి దాడులు విజయవంతం కావడానికి అవసరమైన డబ్బును సమకూర్చినట్లు తెలుస్తోంది. ఓ విదేశీ మారకద్రవ్య ఏజిన్సీతో చేతులు కలిపి, దాని ద్వారా ఉగ్రవాదులకు డబ్బును పంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఉగ్రవాదులు ఆ డబ్బును ఇంటర్నెట్ ఫోన్ ఖాతాకు వినియోగించినట్లు తెలుస్తోంది. పేలుళ్ల సమయంలో ఉగ్రవాదులు సంబంధిత తీవ్రవాద నాయకులతో మంతనాలు జరిపేందుకు వీలుగా వీరు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ఫోన్ ఖాతాలకు పెద్ద మొత్తంలో డబ్బును జమ చేసినట్లు ప్రాధమిక విచారణలో వెల్లడైంది.
కాగా వీరి వద్ద నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.