ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఆఫ్ఘన్‌కు మరిన్ని బలగాలు: ఒబామా నిర్ణయం వాయిదా (Afghanistan | Obama | America | India | Terrorist | Pak)
తీవ్రవాదులు తిష్టవేసిన ఆఫ్ఘనిస్థాన్‌కు అదనపు బలగాలను పంపాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్న నిర్ణయాన్ని కాస్త వాయిదా వేసుకున్నారు. ఆఫ్ఘన్‌కు అదనపు బలగాలు పంపే విషయంపై ఆయన వచ్చే వారంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా, ఆఫ్ఘన్‌కు అదనపు బలగాలను పంపాలన్న ఒబామా నిర్ణయాన్ని అమెరికాకు చెందిన డెమొక్రటిక్ పార్టీకి చెందిన సెనెట్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని వచ్చే వారానికి ఒబామా వాయిదా వేసుకున్నట్టు వైట్‌హౌస్ అధికార ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో తిష్టవేసి ప్రపంచాన్ని శాసిస్తున్న ఉగ్రవాదులపై అమెరికా సైనిక బలగాలు పాక్ సాయంతో పోరు సాగిస్తున్న విషయం తెల్సిందే. అయినప్పటికీ తీవ్రవాదుల ఆగడాలను సమర్థవంతంగా అణిచివేయలేక పోతున్నాయి.