జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » చైనా బొగ్గు గనిలో ప్రమాదం: 87కు పెరిగిన మృతులు (China | Coal | Accident | Gas | Officials | Labours)
Feedback Print Bookmark and Share
 
చైనాలోని ఒక బొగ్గు గనిలో శనివారం జరిగిన భారీ పేలుడు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 87కు పెరిగింది. చైనాలోని కిలాంగ్షియాంగ్ ప్రొవియన్స్‌లో ఉన్న హేకాంగ్ నగరంలో బొగ్గు గనిలో శనివారం తెల్లవారు జామున 2.30 గంటలకు గ్యాస్ కారణంగా భారీ పేలుడు చోటు చేసుకుంది.

వెంటనే రక్షణ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని గనిలో పని చేస్తున్న 399 మంది కార్మికులను ప్రాణాలతో రక్షించారు. అనేక మంది గనిలో చిక్కుకుని పోయారు. వీరిలో 87 మంది మరణించినట్టు చైనా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

గనిలో చిక్కుకున్న వారిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న 42 మందిని ప్రాణాలతో రక్షించారు. మరో 60 మంది గని శిథిలాల కింద చిక్కుకుని శనివారమే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఆదివారానికి 87కు చేరుకుంది. మరో 21 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.