జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » సముద్రంలో మునిగిన నౌక: 228 మంది జలసమాధి (Sumatra island | Passenger ferry | Indonesia | Indonesia | Raiu | Sinks)
Feedback Print Bookmark and Share
 
ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో ప్రయాణికులతో వెళుతున్న నౌక ఒకటి మునిగి పోయింది. ఈ ప్రమాదంలో నౌకలోని 228 మంది ప్రయాణికులు జలసమాధి అయినట్టు ప్రాథమిక సమాచారం. ఈ విషయాన్ని ఇండోనేషియా టెలివిజన్ న్యూస్ ఛానల్ పేర్కొంది. రైవు ప్రొవియన్స్‌ పోలీసు చీఫ్ యాసిన్ కోసయ్య మాట్లాడుతూ.. వోయాగే అనే దుమాయ్ ఎక్స్‌ప్రెస్-10 అనే నౌక ఆదివారం ఉదయం సముద్ర జలాల్లోకి వెళ్లి మునిగిపోయిందన్నారు.

ఈ నౌకలో 15 మంది చిన్నారులతో సహా 228 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిపారు. ఈ నౌక సుమత్రా దీవుల్లోని రైవు ప్రొవియన్స్‌లోని బాటమ్ నుంచి దుమైకు బయలుదేరిందని చెప్పారు. అయితే, స్థానిక పోలీసులు మాత్రం నౌకలో ఉన్న ప్రయాణికుల్లో 12 మందిని రక్షించినట్టు చెప్పారు. ఇటీవలి కాలంలో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో జరుగుతున్న నౌక ప్రమాదాల్లో వందలాది మంది మృత్యువాత పడుతున్న విషయం తెల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.