ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఇండో-యూఎస్ చర్చలు: తీవ్రవాదమే ప్రధాన అజెండా! (International | terror | network | Indo-US | talks | agenda | Italy)
అమెరికా, భారత్ దేశాల మధ్య జరుగనున్న చర్చల్లో అంతర్జాతీయ తీవ్రవాదమే ప్రదాన అజెండాగా మారనుంది. వీటితో పాటు.. ముంబై దాడుల దర్యాప్తు పురోగతిపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి.
తొమ్మిది రోజుల పర్యటన కోసం ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికాకు బయలుదేరి వెళ్లిన విషయం తెల్సిందే. ఈ పర్యటనలో అమెరికా, ట్రినిడాడ్, టుబాగో ప్రాంతాల్లో పర్యటిస్తారు. అలాగే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఈనెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరిగే కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీట్‌లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.
ప్రధాని తన అమెరికా పర్యటనలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకోవాల్సిన చర్యలపై విపులంగా చర్చిస్తారు. అలాగే, అంతర్జాతీయ తీవ్రవాదంపై పరస్పర సహకారం మరింత బలంగా ఉండాలని ఆకాంక్షించనున్నారు.
ముంబై దాడులకు సంబంధించి ఇటాలీకి చెందిన పాక్ జాతీయులైన తండ్రీ కొడుకులను స్థానిక పోలీసులను అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ అంశంపై కూడా ప్రధాని చర్చించనున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్-అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలు వైట్‌హౌస్‌లో భేటీ కానున్న విషయం తెల్సిందే.